Australia retained the Ashes after beating England by 185 runs in the final session of the fourth test at Old Trafford on Sunday.Josh Hazlewood claimed the winning wicket, trapping Craig Overton lbw, as Australia dismissed England's second innings for 197 deep into the evening session to take a 2-1 lead in the five-match series.
#ashes2019
#englandvsaustralia
#stevesmith
#patcummins
#josbutler
#joedenly
#JoshHazlewood
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' స్టీవ్ స్మిత్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకోగా.. అనంతరం బౌలర్లు ఇంగ్లండ్ జట్టును బెంబేలెత్తించడంతో యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ 2-1తో సిరీస్ ఆధిక్యంలో నిలవడంతో పాటు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకుంది.ఓవర్‌నైట్ స్కోరు 18/2 వద్ద ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను డ్రా చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. ఉదయం కమిన్స్, హాజెల్‌వుడ్ నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొనేందుకు జో డెన్లీ, జేసన్ రాయ్ ఇబ్బంది పడ్డారు. డెన్లీ అయితే రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు రాయ్ డిఫెన్స్ ఆడడంతో తొలి గంట వికెట్ కోల్పోకుండా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కొనసాగించింది.